ఆమె ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదు : నిమ్స్‌ వైద్యులు

-

ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన మెడికో విద్యార్థిని ప్రీతికి నిమ్స్ లో చికిత్స కొనసాగుతోంది. ఆమె ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదని నిమ్స్ వైద్యులు చెబుతున్నారు. 72 గంటలకు పైగా వెంటిలేటర్, ఎక్మోపైనే చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీతికి ఈసీజీ టెస్టు చేయనున్నట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు. సాయంత్రంలోగా ఈ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రీతి బ్రెయిన్ యాక్టివిటీ గురించి తెలుసుకునేందుకే ఈ టెస్ట్ చేస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రీతి ఆరోగ్యం ఉండాలని కోరుకుందామని నిమ్స్ వైద్యులు తెలిపారు. తన ఆరోగ్యం కాపాడేందుకు తాము శ్రమిస్తున్నామని చెప్పారు. ప్రీతి ఆరోగ్యం పై నిమ్స్ ఎప్పటికప్పుడు బులిటెన్ విడుదల చేస్తోందని.. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేయోద్దని డాక్టర్లు కోరారు.

నిమ్స్ బులిటెన్ రూపంలో విడుదల చేస్తున్న సమాచారం మాత్రమే సరైందని.. దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ప్రీతిని పరామర్శించేందుకు రాజకీయ నేతలు నిమ్స్ వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు కుటుంబసభ్యులు ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నామని.. ప్రీతి కండీషన్ గురించి తమకు నిజం చెప్పండి అని వైద్యులను వేడుకుంటున్నారు. తనని ఎలాగైనా ప్రాణాలతో బతికించాలని తండ్రి నాగేందర్ కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version