ఆగస్ట్ నెలలో తొమ్మిది రోజులు బ్యాంకులు సెలవు..!

-

మీకు ఏమైనా ముఖ్యమైన బ్యాంక్ పనులు ఉన్నాయా..? అయితే తప్పక బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకోవాలి. ఈ నెలలో శనివారాలు, ఆదివారాలతో పాటుగా ఇతర హాలిడేస్ కూడా ఉన్నాయి. మాములుగా అయితే రెండవ శనివారం, నాల్గవ శనివారం సెలవు ఉంటుంది. అలానే ఆదివారాలు కూడా సెలవే. ఆగస్టులో మొత్తం 5 ఆదివారాలు వచ్చాయి.

ఇవి కాకుండా పబ్లిక్ హాలిడేస్ కూడా ఉంటాయి. ఆగస్టులో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సెలవు ఉంటుందన్న సంగతి తెలిసిందే. కానీ ఈసారి ఆగస్ట్ 15 ఆదివారం వచ్చింది. కనుక సెలవు ఆదివారంలో కలిసిపోయింది.

ఇది ఇలా ఉంటే ఆగస్టు నెలలో మొహర్రం, శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సెలవులు ఉన్నాయి. దీనితో మొత్తం కలిపి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ బ్యాంకులకు 9 రోజులు సెలవులు రావడం జరిగింది.

2021 ఆగస్ట్ 1- ఆదివారం
2021 ఆగస్ట్ 8- ఆదివారం
2021 ఆగస్ట్ 14- రెండో శనివారం
2021 ఆగస్ట్ 15- ఆదివారం, ఇండిపెండెన్స్ డే
2021 ఆగస్ట్ 19- మొహర్రం (గురువారం నాడు)
2021 ఆగస్ట్ 22- ఆదివారం
2021 ఆగస్ట్ 28- నాలుగో శనివారం
2021 ఆగస్ట్ 29- ఆదివారం
2021 ఆగస్ట్ 31- కృష్ణాష్టమి (మంగళవారం నాడు)

Read more RELATED
Recommended to you

Exit mobile version