ఒలింపిక్స్ ఫ్రీ క్వార్టర్స్‌కు ఆర్చర్ అతాను దాస్ .. కొరియా ఆర్చర్‌పై సంచలన విజయం

-

ఒలింపిక్స్: టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. షట్లర్, హాకీ, ఆర్చర్ విభాగంలో దూసుకుపోతున్నారు. పీవీ సింధు ప్రీ కార్టర్స్‌లో అద్భుత విజయం సాధించగా హాకీ జట్టు కూడా గెలిచింది.

తాజాగా అర్చర్ అతాను దాస్ కూడా సత్తాచాటారు. దక్షిణ కొరియా ఆర్చర్‌పై గెలిచి ఫ్రీకార్టర్స్‌కు దూసుకెళ్లారు. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో కొరియా ఆర్చర్‌ను ఓడించారు. ఎలిమినేషన్ రౌండ్‌లో జిన్ హెక్‌పై 6-5తేడాతో దాస్ విజయం సాధించారు. గత ఒలింపిక్స్‌లో జిన్ హెక్ స్వర్ణ పతకం సాధించి విజేతగా నిలిచారు. ఇప్పుడు జిన్ హెక్‌పై గెలవడంతో భారత ఆర్చర్ అతాను దాస్ మరింత ఉత్సాహంగా ఉన్నారు.

ఒలింపిక్స్‌లో భారత షట్లర్ పీవీ సింధు విజయ పరంపరం కొనసాగుతోంది. వరుస విజయాలతో పీపీ సింధు దూసుకుపోతున్నారు. ఫ్రీ క్వార్టర్స్‌లో మళ్లీ ప్రత్యర్థిని చిత్తు చేశారామె. డెన్మార్క్ షెట్లర్ బ్లిక్ ఫెల్ట్ తో జరిగిన మ్యాచ్‌లో ప్రారంభం నుంచి ఆధిపత్యం చూపించారు. 21-15,21-13తో బ్లిక్ ఫెల్ట్ ‌పై విజయం సాధించారు. ఈ మ్యాచ్‌కు ముందు వీరిద్దరూ 5సార్లు తలపడ్డారు. నాలుగుసార్లు పీవీ సింధునే గెలిచారు. వరుసగా మూడు విజయాలతో గ్రూప్ జేలో తొలిస్థానంలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version