రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలకు నష్టం కలిగింది. వడగండ్ల వాన అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రైతులు బాధలో ఉంటే మంత్రి వారికి భరోసా ఇవ్వడం లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్ లో ఈరోజు అయిన మీడియాతో మాట్లాడారు అకాల వర్షాల వలన పంట నష్టపోయిన రైతులకు ఎకరాకి 10000 పంటల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం ప్రాజెక్ట్ ల గేట్లు ఎత్తమంటే కాంగ్రెస్ నేతలు రాజకీయ గేట్లు ఎత్తామని అంటున్నారని ధ్వజమెత్తారు.
రైతుల్ని దెబ్బ మీద దెబ్బ కొడుతున్న రేవంత్ సర్కార్ అన్ని రంగాల్లో మెగా మోసం అని అన్నారు గత ఏడాది అకాల వర్షాలు నేపథ్యంలో పంటలు దెబ్బతింటే వికారాబాద్ వరంగల్ జిల్లాలో పంటలు దెబ్బ వ్యవసాయ శాఖ మంత్రిగా తాను కేసీఆర్ వెళ్లి రైతులకు ధైర్యం ఇచ్చామని గుర్తు చేశారు. అప్పుడు ఎకరాకి 10000 నష్టపరిహారం ఇస్తే బిచ్చం వేస్తున్నారని ఇదే రేవంత్ కాంగ్రెస్ నేతలు అన్నారని గుర్తు చేశారు.