జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్‌పై మంత్రి నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు వరిసాగు నేర్పిందని ఎన్టీఆరే అని.. ఎవరో మూర్ఖుడు, ప్రముఖ సినీ నటుడు అనడం సిగ్గచేటన్నారు. అంతటి మూర్ఖుడిని ఎక్కడ చూడలేదని.. చరిత్ర తెలియని మూర్ఖులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. 1100 ఏళ్ల క్రితం నుండే తెలంగాణలో వరి సాగు చేస్తున్నారని మంత్రి తెలిపారు. కాగా, గతంలో పవన్ కల్యాణ్ ఓ సమావేశంలో తెలంగాణ వాళ్లకి ఎన్టీఆర్ పాలనలోనే వరి అన్నం సాగు తెలిసిందని వ్యాఖ్యానించారు. తాజాగా ఆ వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెరిగాయని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. యువత నూతనంగా ఆలోచించి భిన్నమైన రంగాలను ఎంచుకోవాలని సూచించారు. పల్లె నిద్రలో భాగంగా వనపర్తి జిల్లాలోని రేవల్లి మండలం తల్పునూరులో ప్రజల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో వాడవాడనా తిరిగి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. పల్లె నిద్రతో మరుగునపడిన సమస్యలు తన దృష్టికి వస్తున్నాయని చెప్పారు. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించానని చెప్పారు.