కాటికి కాలు చాపిన చంద్రబాబు చంపే అవసరం ఎవరికీ లేదు.. మరోసారి రాప్తాడు ఎమ్మెల్యే సంచలనం

-

అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మరోసారి హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఒక అమ్మకు అబ్బకు పుట్టి ఉంటే మా ఇంటి వద్దకు వచ్చి ప్రాణాలతో తిరిగి వెళ్లండని ఆయన సవాల్‌ విసిరారు. మా ఇంటికి ముట్టడికి వచ్చి.. పారిపోయారని ఎగతాళి చేస్తున్నారని, పరిటాల రవి అనుచరుడు జగ్గుతో అమ్మను తిట్టించారన్నారు. కొడుకులుగా మాకు బాధ ఉండదా..? అని ఆయన మండిపడ్డారు. నాకు ప్రాణహాని కల్గుతుందన్న బాధతో మా అన్న మాట్లాడి ఉండొచ్చని, ఆయన మాట్లాడిన భాష మీద మా పెద్దలు మందలించారు.. క్షమాపణ చెప్పామన్నారు. మరి మా తల్లిని తిట్టిన దానికి ఒక్క టీడీపీ నేత అయినా తప్పు అని చెప్పారా అని ఆయన ప్రశ్నించారు. 3వ తేది నుంచి 14వ తేదీ వరకు జనంలోకి వెళ్తామని, వెళ్లిన ప్రతి చోటా మేము చేసిన అభివృద్ధి.. వారు చేస్తున్న అరాచకాలు చెప్తామన్నారు.

పరిటాల సునీత తిట్టించిన అంశాన్ని కూడా జనంకి చెబుతామని, కాటికి కాలు చాపిన చంద్రబాబు చంపే అవసరం ఎవరికీ లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిటాల రవి నేర చరిత్ర చూసి టీడీపీలో రాజకీయ పట్టాభిషేకం చేశారని, మా సోదరుడు చందుని ఆరోజు పరిటాల రవి చంపాలని చూశారన్నారు. ఆ సమాచారం చెప్పిన వారిని ఎన్ కౌంటర్ చేయించాడన్నారు. మద్దెల చెరువు సూరి కుటుంబం మొత్తాన్ని రవి చంపించారని, అందుకే సూరి రవిని చంపి ప్రతీకారం తీర్చుకున్నారన్నారు. 150హత్యలు చేసినా వారికి ఎందుకు శిక్ష పడలేదు.. ఎవరు కాపాడారన్నారు. 2009లో నన్ను ఓడించేందుకు.. జైలులో ఉన్న సూరీతో రాజీ పడ్డారని, సూరిని భానుతో చంపించింది పరిటాల సునీతనే అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version