రేషన్‌ షాపులకు మోడీ ఫ్లేక్సీ కట్టాలి..లేకుంటే నేనే కడతా – నిర్మలా

-

తెలంగాణ రాష్ట్రంలోని రేషన్‌ షాపులకు ప్రధాని మోడీ ఫ్లేక్సీల కట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదేశాలు జారీ చేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం చేశారు. ఇవాళ కామారెడ్డి జిల్లా బీర్కూర్ లో రేషన్ షాప్ తనిఖీ చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.

ఈ సందర్భంగా పేదలకు ఇచ్చే రేషన్ బియ్యంలో కేంద్రం వాటా, రాష్ట్ర వాటా ఎంత అని కలెక్టర్ ని ప్రశ్నించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. అయితే.. తనకి తెలియదని నిర్మలా సీతారామన్ కు విచిత్రంగా సమాదానం ఇచ్చారు కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్. మీరు IAS ఆఫీసర్ అయ్యి మీకు ఎలా తెలియదు అని ప్రశ్నించిన నిర్మలా సీతారామన్… అరగంట టైమ్ ఇస్తాను తెలుసుకొని చెప్పమని ఆదేశించారు.

అలాగే.. రేషన్‌ షాపులకు ప్రధాని మోడీ ఫ్లేక్సీల కట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఒక వేళ మోడీ ఫ్లేక్సీ కట్టకపోతే.. తానే సాయంత్రం వచ్చి మరీ.. ప్లేక్సీ కడతానని పేర్కొన్నారు. రేషన్‌ బియ్యంలో వాటా మొత్తం కేంద్రానిదేనని పేర్కొన్నారు నిర్మల.

Read more RELATED
Recommended to you

Exit mobile version