పెళ్లికూతురు గెటప్ లో ఆకట్టుకుంటున్న నివేతా పేతురాజ్..!

-

గ్లామర్ లుక్ తో ఆకట్టుకునే ముద్దుగుమ్మ నివేత పేతురాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. మోడల్గా తన కెరియర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ 2016లో తమిళ చిత్రం ద్వారా హీరోయిన్గా మారింది. ఈమె మెంటల్ మదిలో అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఒకవైపు గ్లామర్ షో తో పాటు మరొకవైపు ఛాలెంజింగ్ పాత్రలు చేస్తూ మెప్పిస్తోంది. నివేత చిత్రాలహరి, బ్రోచేవారెవరురా, అలవైకుంఠపురంలో వంటి విజయవంతమైన చిత్రాలలో నటించగా.. రామ్ సరసన రెడ్ సినిమాలో కూడా నటించింది. అయితే ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ సరసన పాగల్ సినిమాలో నటించింది. ఈ చిత్రం కూడా విజయాన్ని అందించలేకపోయింది.

ఇదిలా ఉండగా నిత్యం గ్లామర్ లుక్ తో ఆకట్టుకునే ఈమె.. మరోవైపు నటనతో మెప్పిస్తూ తెలుగు, తమిళ్ భాషలో అవకాశాలను అందుకుంటుంది. తెలుగులో నివేత మరిన్ని అవకాశాలను పొందాలని ఆమె అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

నిజానికి ఈమె ఒక మల్టీ టాలెంటెడ్ నటి .. ఈమెకు రేసింగ్ లో కూడా మంచి ప్రావీణ్యం ఉంది. తరచుగా నివేద పేతురాజు రేసింగ్ కి సంబంధించి ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. లేడీ బాస్ తరహాలో రేసింగ్ లో పాల్గొంటున్న దృశ్యాలను ఆ వీడియోలను కూడా అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది.

ఇదిలా ఉండగా తాజాగా మైండ్ బ్లోయింగ్ ఫోటోషూట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పెళ్లికూతురులా ముస్తాబైన నివేత పెతురాజు వెడ్డింగ్ స్టోరీస్ అనే మ్యాగజైన్ కోసం ఇలా ఫోటోషూట్ చేసి అందర్నీ ఆకట్టుకుంది. ముదురు పసుపు వర్ణం కలిగిన లెహంగా ధరించి దిమ్మతిరిగే ఫోజులిచ్చింది పెళ్ళికూతురు తరహాలో సిగ్గుపడుతూ నివేద ఫోటోలకు ఫోజులు ఇవ్వడం అందర్నీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పెళ్లికూతురు దుస్తుల్లో కూడా గ్లామర్ షో చేయడం అంటే ఒక నివేదాకు మాత్రమే చెల్లింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version