అక్టోబర్ 9న నిజామాబాద్ స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నిక

-

తెలంగాణాలో అధికార విపక్షాలు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలయ్యింది. బీహార్ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు కూడా జరగనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఆ ప్రకటన మేరకు అక్టోబర్ 9న ఉపఎన్నిక జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక 12వ తేదీన కౌంటింగ్ కూడా జరగనుంది. నిజానికి నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మార్చి 12న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

దాని ప్రకారం ఏప్రిల్‌ 7వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉన్నా కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి మూడో వారం నుంచి లాక్‌ డౌన్‌ ప్రకటించడంతో ఎన్నికల సంఘం కూడా ఈ ఉప ఎన్నిక ప్రక్రియ వాయిదా వేసింది. ఎమ్మెల్సీగా ఉన్న భూపతిరెడ్డిపై అనర్హత వేటుతో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఈ ఎన్నికల్లో పోటీకి ముందే అభ్యర్థులను ముందే ఖరారు చేశారు పార్టీలు. టీఆర్‌ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి సుభాష్‌ రెడ్డి, బీజేపీ నుంచి యెండల లక్ష్మీనారాయణలు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న అందరు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కో ఆప్షన్‌ సభ్యులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు  ఓటు హక్కును కలిగి ఉన్నారు. వీరే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మె ల్సీని ఎన్నుకోనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version