కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (25-09-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో శుక్ర‌వారం (25-09-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

1. ప్ర‌ముఖ గాయ‌కుడు, న‌టుడు ఎస్‌పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం శుక్ర‌వారం క‌న్నుమూశారు. క‌రోనా బారిన ప‌డ్డ ఆయ‌న చెన్నై ఎంజీఎం హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటూ కోలుకున్నారు. కానీ అనారోగ్య స‌మ‌స్య‌లు రావ‌డంతో ఆయ‌న క‌న్ను మూశారు.

2. ఏపీలో కొత్త‌గా 7,073 క‌రోనా కేసులు నమోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 6,61,458కు చేరుకుంది. 5,606 మంది చ‌నిపోయారు. 67,683 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 5,88,169 మంది కోలుకున్నారు.

3. మార్చి చివ‌రి నుంచి తెలంగాణ‌లో క‌రోనా కార‌ణంగా మూత‌ప‌డ్డ బార్లు, క్ల‌బ్‌లు ఎట్ట‌కేల‌కు తెరుచుకోనున్నాయి. వాటిని ఓపెన్ చేసేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చింది.

4. దేశ‌వ్యాప్తంగా మొత్తం 1818 ల్యాబ్‌ల‌లో క‌రోనా టెస్టులు చేస్తున్నారు. వాటిల్లో 1084 ప్ర‌భుత్వ ల్యాబ్‌లు కాగా.. 734 ప్రైవేటు ల్యాబ్‌లు ఉన్నాయి. గ‌త 24 గంటల్లో 15 ల‌క్ష‌ల ప‌రీక్ష‌లు చేశారు.

5. క‌రోనా నేప‌థ్యంలో మార్చి నుంచి నిలిచిపోయిన హైద‌రాబాద్ సిటీ బ‌స్సు స‌ర్వీసులు శుక్ర‌వారం ప్రారంభ‌మ‌య్యాయి. గ్రేట‌ర్ లో అన్ని రూట్ల‌లో 25 శాతం సిటీ బ‌స్సుల‌ను న‌డిపిస్తున్నారు.

6. చైనాలో ఫుడ్ ప్యాకెట్ల‌పై క‌రోనా వైర‌స్ ఉన్న‌ట్లు అక్క‌డి అధికారులు గుర్తించారు. చైనా తూర్పు న‌గ‌ర‌మైన కింగ్ డావోలో అధికారులు ప‌లు సీ ఫుడ్ ప్యాకెట్ల‌పై క‌రోనా వైర‌స్ ఉన్న‌ట్లు నిర్దారించారు.

7. బీహార్ లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కోవిడ్ జాగ్ర‌త్త‌లతో అక్క‌డ అధికారులు పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. క‌రోనా ఉన్న‌వారు కూడా ఓటు వేసేందుకు అధికారులు అక్క‌డ ప్ర‌త్యేక ఏర్పాట్లు చేయ‌నున్నారు.

8. తెలంగాణ‌లో కొత్త‌గా 2,381 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,81,627కు చేరుకుంది. 1,080 మంది చ‌నిపోయారు. 30,387 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1,50,160 మంది కోలుకున్నారు.

9. మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 17,794 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 13,00,757కు చేరుకుంది. 2,72,775 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 34,761 మంది చ‌నిపోయారు. 9,92,806 మంది కోలుకున్నారు.

10. త‌మిళ‌నాడులో కొత్త‌గా 5,679 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5,69,370కి చేరుకుంది. 9,148 మంది చ‌నిపోయారు. 5,13,836 మంది కోలుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version