తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఓటర్లకు కొన్ని సూచనలు చేసింది. పోలింగ్ బూత్ లోనికి సెల్ ఫోన్లను అనుమతించేది లేదని అధికారులు, పోలీసులు వెల్లడించారు. ఫోన్లను ఇంటివద్దే పెట్టి పోలింగ్ బూతుకు వెళ్లాలని ఈసీ అధికారులు సూచించారు. మొదటి సారి ఓటు వేసేవాళ్లు కూడా ఈ సూచనలను తప్పకుండా పాటించాలని అధికారులు వెల్లడించారు.