కె.జి.ఎఫ్ చీఫ్ గెస్ట్ రాజమౌళి

-

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వస్తున్న సినిమా కె.జి.ఎఫ్. గోల్డ్ మైన్ స్కాం నేపథ్యంలో సాగే ఈ సినిమా టీజర్ సినిమాపై ఆసకి పెంచింది. భారీ హంగులతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ, హింది, మళయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్ 21న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

అనుకున్నట్టుగానే కన్నడ పరిశ్రమలో భారీ బడ్జెట్ సినిమాలను తలదన్నేలా ఈ మూవీ మేకింగ్ ఉంది. యాక్షన్, సెంటిమెంట్ మేళవించి సినిమా తెరకెక్కించాడు దర్శకుడు ప్రశాంత్. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో దర్శక ధీరుడు రాజమౌళిని వాడుతున్నారు. వారాహి చలన చిత్ర బ్యానర్ కె.జి.ఎఫ్ తెలుగు వర్షన్ రిలీజ్ చేస్తుంది. అందుకే ఈ నెల 9న కె.జి.ఎఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమౌళి గెస్ట్ గా వస్తున్నాడట.

రాజమౌళి చీఫ్ గెస్ట్ అంటే ఇక ఆ సినిమాకు బీభత్సమైన పబ్లిసిటీ వచ్చినట్టే. డిసెంబర్ 21న కె.జి.ఎఫ్ తో రెండు తెలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి. మరి వాటిని తట్టుకుని కె.జి.ఎఫ్ తెలుగులో నిలబడుతుందా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version