కంచుకోటలో రెడ్డి ‘ఫ్యాన్స్’ తగ్గేదేలే..టీడీపీకి నో ఛాన్స్!

-

ఏపీలో అధికార వైసీపీపై కాస్త ప్రజా వ్యతిరేకత కనిపిస్తున్న విషయం తెలిసిందే..2019 ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు వైసీపీ బలం తగ్గుతూ వస్తుందని ఇటీవల పలు సర్వేలు కూడా చెబుతున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ-టీడీపీల మధ్య 9-10 శాతం ఓట్లు తేడా ఉంటే..ఇప్పుడు అది 2-3 శాతానికి వచ్చిందని సర్వేలు చెబుతున్నాయి. అంటే రాష్ట్రంలో వైసీపీ ఆధిక్యం తగ్గుతూ వస్తుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో వైసీపీకి ధీటుగా టీడీపీ పుంజుకుంది.

అయితే అన్నీ జిల్లాల్లో పరిస్తితి ఒకలా ఉంటే…నెల్లూరు జిల్లాలో పరిస్తితి మరొకలా ఉంది..ఇక్కడ టీడీపీకి బలపడే ఛాన్స్ దక్కడం లేదు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి పెద్దగా ఛాన్స్ ఇవ్వడం లేదు. మామూలుగానే నెల్లూరు అంటే వైసీపీకి కంచుకోట..గత ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ క్లీన్ సీప్ చేసింది..10కి 10 సీట్లు గెలుచుకుంది. ఇక అక్కడ నుంచి నెల్లూరులో వైసీపీ హవా కొనసాగుతూనే వస్తుంది. పంచాయితీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ వన్ సైడ్ గా విజయాలు సాధించింది. అసలు నెల్లూరు కార్పొరేషన్ లో టీడీపీ ఒక్క వార్డు కూడా గెలుచుకోలేదంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇలా జిల్లాలో వైసీపీ బలం తగ్గకుండా ఉంది…అయితే జిల్లాలోని రెడ్డి నేతలు వైసీపీ బలం తగ్గకుండా చూసుకుంటున్నారని చెప్పొచ్చు. వాస్తవానికి జిల్లాలో 10 సీట్లు ఉంటే…అందులో 7 మంది రెడ్డి ఎమ్మెల్యేలే. నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరిలో ఆనం రామ్ నారాయణరెడ్డి, కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డి, కావలిలో రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఇక ఉపఎన్నిక జరగనున్న ఆత్మకూరు సైతం మేకపాటి ఫ్యామిలీ చేతుల్లోకి వెళ్లనుంది. ఇలా ఏడు స్థానాల్లో రెడ్డి నేతలే ఉన్నారు…ఇక వీరు బలంగా ఉండటంతో పార్టీ కూడా బలంగా కనిపిస్తోంది. అందుకే నెల్లూరులో టీడీపీకి బలపడే ఛాన్స్ రావడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version