కరోనా వైరస్ నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్ సమయంలో నిలిచిపోయిన సాధారణ రైలు సర్వీసులు ఇంకా పునఃప్రారంభం కాలేదు. అయితే ఇప్పుడు కొన్ని సర్వీసులు నడుస్తున్నా కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన ఈ సర్వీసులన్నీ ఎప్పుడు పునఃప్రారంభిస్తారు అనే దాని మీద సరయిన క్లారిటీ లేదు. అయితే మళ్ళీ ఎప్పుడు ప్రారంభిస్తామనేది ఇప్పుడే చెప్పలేమని రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ పేర్కొన్నారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని.. దశల వారీగా ప్యాసింజర్ రైళ్లను పునరుద్దరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలతో జనరల్ మేనేజర్లు చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే ఈ రైలు సర్వీసులను ఇప్పుడే పునరుద్దరించడానికి ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేవని అన్నారు. కోల్‌కతా మెట్రో 60 శాతం, ముంబయి సబర్బన్ 80 శాతం, చెన్నై సబర్బన్లలో 50 శాతం మేర సర్వీసులు నడుస్తున్నాయని ఆయన అన్నారు.