వివిధ రకాల ఫోన్‌యాప్‌ల ద్వారా అప్పుటిస్తామంటూ.. ఇచ్చినట్టే ఇచ్చి ఆ తర్వాత యాప్‌ల నిర్వాహకులు చేసే వేధింపులకు ఊపిరిలే ఆగిపోతున్నాయి. ఈ క్రమంలో వీటికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. యాప్‌ల యాజమాన్యం ఒత్తిడి, వేధింపులకు ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురు ప్రాణాలు వదిలారు. బా«ధితులు, కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ శాఖ వారిని గుర్తించే పనిలో పడ్డారు.
సాంకేతికతను జోడించి యాప్‌ల ద్వారా ఎవరూ రుణాలిస్తున్నారో అని ఆరా తీయగా.. వారు భాగ్యనగరంలోనే ఉన్నట్లు గుర్తించారు. కొన్నియాప్‌లు సష్టించి ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలిచ్చి, అధిక వడ్డీ దండుకుంటున్న ఓ యువకుడిని అదుపులోకి తీసుకొని ఓ ప్రత్యే ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. ఎప్పుటి నుంచో ఈ వ్యవహారం నడుపుతున్నాడు. ఇంత వరకు ఎంత మంది బా«ధితుల నుంచి ఎంతెంతా డబ్బులు గుంజుకున్నాడో అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.
5-10 నిమిషాల్లోనే..
ఎలాంటి డాక్యుమెంట్లు, మధ్యవర్తి లేకుండా కేవలం పది నిమిషాల్లో వారు చెప్పిన వివరాలు ఫోన్లో అప్‌లోడ్ చేస్తే వెంటనే ఆకౌంట్‌లోకి డబ్బులు వేస్తారు. 10 15 రోజుల్లో తిరిగి చెల్లించాలని ఫోన్లు, మెసెజ్‌లు చేస్తారు. ఆ తర్వాత కాస్త లేటైతే.. కుటుంబ సభ్యులు, స్నేహితులు, పనిచేసే సంస్థలకు ఫలాన వ్యక్తి మోసం చేశాడని, మెసెజ్‌లు పెడుతారు. ఇలాంటి పనులకు తెగబడుతున్న సైబర్ నేరగాళ్లు హైదరాబాద్, బెంగళూర్, చెనై, ఢిల్లిలలో మాకం వేసినట్లు పోలీసులు గుర్తించారు.
చైనాకు చెందినవే..
ఈ యాప్‌లు అ«ధికంగా చైనాకు చెందినవి. అందులో సరైన ఫోన్ నంబర్లు, పూర్తి వివరాలు ఉండవని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ఒక్కసారి ఫోన్ ద్వారా లోన్ తీసుకున్న వారి అన్ని నంబర్లు, ఫొటోలు, ఇంటర్నేట్ సమాచారం అంతా వారు సేకరిస్తారు. తక్కువ సమయంలో లోన్ ఇస్తారని ఆశతో తీసుకోరాదని, ఆ తర్వాత అధిక వడ్డీలు కట్టాలని వేధింపులకు గురి చేస్తారన్నారు. ఆప్పులిస్తున్న రుణయాప్‌లలో ఎక్కువశాతం ఆర్బీఐ వద్ద నమోదు కాలేదన్నారు. ఎవరికైనా యాప్‌ల నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడితే సమీనంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని డీజీపీ సూచించారు.