రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కరెంట్ కోతలు మొదలయ్యాయని ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అదే పనిగా ఆరోపిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ పలు సందర్భాల్లో ఆ విషయాన్ని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తుంటారు. ఆ మధ్య ఏకంగా అసెంబ్లీలోనూ పవర్ కట్ అయ్యింది.
తాజాగా కరెంట్ లేక సెల్‌ఫోన్ లైట్ల వెలుగులో అంత్యక్రియలు నిర్వహించారు. ఇది ఎక్కడో మారుమూల పల్లెలో జరిగిందనుకుంటే పొరపాటే. హైదరాబాద్ మహానగరంలోని లంగర్ హౌస్ – బాపుఘాట్ త్రివేణి సంగం శ్మశానవాటికలో కనీసం విద్యుత్ దీపాలు కూడా లేకపోవడంతో బీజేపీ నాయకుడు గడ్డి చంద్రశేఖర్ తల్లి అంత్యక్రియలను సెల్‌ఫోన్ లైట్ల వెలుగులో పూర్తి చేయాల్సి వచ్చింది. శ్మశాన వాటికలో కరెంట్, విద్యుత్ దీపాలు వెలగకపోవడంపై బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు.