భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజాగా ఢిల్లీలో వెలుగుచూసింది. ఢిల్లీ కళ్యాణ్ విహార్ ప్రాంతానికి చెందిన పునీత్ ఖురానా(40), అతని భార్య మానికా జగదీశ్ పహ్వా ఇద్దరు కలిసి ఉడ్‌బాక్స్ కేఫ్ అనే బేకరి పెట్టారు. అది సక్సెస్ ఫుల్‌గా నడుస్తోంది. అయితే, కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతుండటంతో విడాకులకు అప్లై చేసుకున్నారు. ఆ కేసు కోర్టులో నడుస్తోంది. తాజాగా వీరికి విడాకులు మంజూరయ్యాయి.
ఈ క్రమంలోనే పునీత్‌కు అతని భార్య మానికా ఫోన్ చేసి మనం విడాకులు తీసుకున్నాము. కానీ, నేను ఇంకా వ్యాపార భాగస్వామినే..నాకు రావాల్సిన మొత్తం చెల్లించాల్సిందే అంటూ వేధింపులకు గురిచేసింది. అవి తాళలేక తన ఇంట్లో పునీత్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పునీత్ ఫోన్లో తన భార్యతో మాట్లాడిన 16 నిమిషాల కాల్ రికార్డ్‌ను పోలీసులు గుర్తించారు.ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పునీత్ భార్యను విచారణకు హాజరు కావాలని నోటీసు పంపారు.
ఇదిలాఉండగా, గతేడాది డిసెంబర్లో బెంగళూరులో అతుల్ సుభాశ్ అనే టెకీ సైతం భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.