కొత్త అధ్యక్ష్యుడు అచ్చన్నే.. నో డౌట్స్ !

-

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుని నియామకంలో ఎటువంటి వివాదం లేదని అంటున్నాయి తెలుగుదేశం వర్గాలు. అచెన్న విషయంలో అధినేత ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారంటున్న నేతలు, దీని మీద వివాదాలు ఏవీ లేవని అంటున్నారు. అచ్చెన్నను రాష్ట్ర అధ్యక్షుడిని చేసే విషయంలో పునరాలోచన లేదని పార్టీ పెద్దల నుండి అందుతున్న సమాచారం. శుక్రవారం లోగా అచెన్న పేరును, రాష్ట్ర కమిటీని ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

రాష్ట్ర కమిటీ కూర్పు కోసమే అచ్చెన్నాయుడు పేరును ఇప్పటి వరకు అనౌన్స్ చెయ్యలేదని పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. నిజానికి పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులతో పాటుగానే ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు పేరును ప్రకటిస్తారని అన్నారు. కానీ ఎందుకో కమిటీలు అయితే నియమించారు అధ్యక్ష ప్రకటన మాత్రం జరగలేదు. ప్రస్తుతానికి ఏపీ అధ్యక్ష్యుడిగా ఉత్తరాంధ్రకు చెందిన కళా వెంకట్రావు ఉన్నారు. అయితే ఆయన మీద క్యాడర్ ఎప్పటి నుండో అసంతృప్తితో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version