పోలీసు అధికారుల పై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. పోలీసులు అధికార పార్టీలకు కొమ్ము కాస్తున్నారని దేశ ఉన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. దేశం లోని పోలీసుల తీరు అసహనం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు సీజేఐ ఎన్వీ రమణ…. పోలీసుల తీరు ఇబ్బందికరంగా మారిందని తెలిపారు. ఇలాంటి సంప్రదాయానికి తెరపడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు.
అధికారం మారగానే కొందరు అధికారుల పై చర్యలు తీసు కుంటున్నారని.. ఐపీఎస్ గుర్జిందర్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేయవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల విచారణ కు సహకరించాలని ఐపీఎస్ అధికారికి సూచనలు చేసింది సుప్రీం కోర్టు. దేశం లోని ప్రజలందరూ ఒకటేనని… కానీ.. పోలీసులు అధికారం ఉన్న వైపునే పని చేస్తున్నారని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు సీజేఐ ఎన్వీ రమణ. ఈ వ్యవస్థ పై మార్పు రావాలని ఆయన పేర్కొన్నారు.