నో రుణమాఫీ..బ్యాంకు వేధింపులతో పురుగుల మందు తాగిన రైతు

-

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నియోజకవర్గంలో రుణం కట్టాలని బ్యాంకు అధికారులు అన్నదాతను వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది.దీంతో పురుగుల మందు తాగి చావు బతుకుల మధ్య సదరు రైతు కొట్టుమిట్టాడుతున్నాడు.ఈ ఘటన నల్గొండ జిల్లా కనగల్లు మండలం జీ యడవల్లి గ్రామంలో మంగళవారం ఉదయం వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. రైతు గౌని వెంకన్నకు కో-ఆపరేటివ్ బ్యాంకులో రూ.1,60,000 రుణం ఉంది. ప్రభుత్వం చేసిన రుణమాఫీలో తన రుణం మాఫీ అవ్వలేదని తెలిసింది. దీంతో రుణం కట్టాలని బ్యాంకు అధికారులు 7 రోజుల క్రితం రైతు భూమిలో జెండాలు పాతగా..  మళ్ళీ ఈ రోజు వచ్చి రుణం కట్టకుంటే ఊరిలో డప్పు సాటు వేస్తామని, పొలాన్ని స్వాధీనం చేసుకుంటామని వేధించినట్లు సమాచారం. దీంతో బ్యాంకు అధికారుల వేధింపులు తట్టుకోలేక మనస్తాపానికి గురైన రైతు వెంకన్న వరి చెనుకు కొట్టే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా.. కుటుంబసభ్యులు రైతును ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

https://twitter.com/TeluguScribe/status/1896749569397985330

Read more RELATED
Recommended to you

Latest news