ఎస్ఎల్‌బీసీ టెన్నెల్ ప్రమాదంలో కనిపించకుండాపోయిన వారి గురించి మంత్రి కోమటిరెడ్డి ఆరా తీశారు. సోమవారం ఉదయం టన్నెల్ వద్దకు చేరుకున్న ఆయన.. అధికారులతో సమీక్ష నిర్వహంచారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఎంత కష్టమైనా సరే టన్నెల్‌లో చిక్కుకున్న 8 మందిని కాపాడాలని అధికారులను ఆదేశించారు.దేశ వ్యాప్తంగా జరిగిన టన్నెల్ ప్రమాద సంఘటనల్లో చిక్కుకున్న బాధితులను కాపాడిన నిపుణుల అనుభవాలను తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. SLBC టన్నెల్ వద్ద సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు అధికారులతో మంత్రి కోమటిరెడ్డి చర్చిస్తున్నారు. కాగా, కనిపించకుండా పోయిన వారిపై ఆశలు వదులుకోవాల్సిందేనని రెస్క్యూ బృందాలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.