ఇంతకు మించిన కోర్టు ధిక్కరణ ఉండదు : అమిత్ షా

-

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోర్ట ధిక్కరణ వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఇటీవలే ఎన్నికల ప్రచారంలో భాగంగా “ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. నేను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు” అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన అమిత్ షా.. ఇంతకు మించి కోర్టు ధిక్కరణ ఉండదని అభిప్రాయ పడ్డారు. ప్రభుత్వాలకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పులిస్తుందనే కేజ్రీవాల్ ఉద్దేశమని ఆరోపించారు అమిత్ షా.

బీజేపీకి ఎలాంటి ప్లాన్​ బీ లేదని, అద్భుతమైన మెజారిటీతో మోడీ ప్రభుత్వం ఏర్పడుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల వేళ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ 400 కంటే ఎక్కువ లోక్‌ సభ స్థానాలను గెలవాలనుకుంటుందని ప్రతిపక్షాల చేస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. గత పదేళ్లుగా తమకు పార్లమెంట్​లో పూర్తి మెజారిటీ ఉందని, కానీ ఎప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలనుకోలేదని తెలిపారు. దేశ రాజకీయాల్లో సుస్థిరతను తీసుకువచ్చేందుకు ఎన్​డీఏ 400కంటే ఎక్కువ సీట్లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version