రేపటి నుంచి తెలంగాణాలో కొత్త కేసులు ఉండవ్; ఈటెల

-

తెలంగాణాలో రేపటి నుంచి ఒక్క కేసు కూడా నమోదు అయ్యే అవకాశం లేదని తెలంగాణా ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర పేర్కొన్నారు. తెలంగాణాలో కరోనా తో ఈ రోజు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణాలో లాక్ డౌన్ కారణంగా కేసుల సంఖ్యా తగ్గిందని లేకపోతే కేసులు చాలా ప్రమాదకరంగా పెరిగేవని ఆయన పేర్కొన్నారు. తెలంగాణాలో 101 హాట్ స్పాట్ లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణాలో నేడు 18 కేసులు నమోదు అయ్యాయని ఆయన వివరించారు. దీనితో తెలంగాణాలో 471 కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ 665 శాంపిల్స్ తీయగా అందులో 18 మాత్రమే వచ్చాయని అన్నారు. తెలంగాణాలో ఇప్పటి వరకు కరోనా కారణంగా 12 మంది చనిపోయారని అన్నారు. హాట్ స్పాట్ ప్రకటించిన ప్రాంతాల్లో రాకపోకలు ఉండే అవకాశం లేదని మంత్రి స్పష్టం చేసారు.

ఏప్రిల్ 22 తర్వాత తెలంగాణాలో కరోనా ఉండే అవకాశం లేదని అన్నారు. ప్రస్తుతం 414 మంది కరోనా తో పోరాటం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ౦ నుంచి ఇప్పటి వరకు వెయ్యి వెంటిలేటర్లు ఆర్డర్ ఇచ్చామని అన్నారు. పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. 45 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని ఆయన వివరించారు. ఏప్రిల్ 22 నాటికి ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ కోలుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version