ఆ కంపెనీకి నో పర్మిషన్.. ఉద్యోగి ప్రాణాలు తీశారు!

-

పని ఒత్తిడి కారణంగా ‘ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌’ కంపెనీలో పనిచేసే యంగ్ చార్టడ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.అధికమైన అని ఒత్తిడి కారణంగానే తన కూతురు మృతి చెందినట్లు ఆమె తల్లిదండ్రులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం అన్నా మృతిపై విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర లేబర్ కమిషనర్ అధికారులు పుణెలోని ఎర్నెస్ట్ అండ్‌ యంగ్ (EY) ఆఫీసులో తనిఖీలు నిర్వహించారు.

అన్నా మృతికి సంబంధించిన ఆధారాల సేకరణ కోసం ఆఫీసు,పరిసరాల్లో సోదాలు జరిపారు. తాజాగా ఆ కంపెనీకి సంబంధించి ఓ విషయం సంచలనం రేపుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌’ కంపెనీ రిజిస్ట్రేషన్ కోసం కార్మిక శాఖకు దరఖాస్తు చేసుకున్నట్లు తేలింది. కాగా, 16 ఏళ్లుగా రిజిస్ట్రేషన్ చేయని కారణంగా అనుమతికి కార్మిక శాఖ నిరాకరించినట్లు సమాచారం. అయితే, కార్మికుల మరణానికి సంస్థ కారణమైతే రూ.5లక్షల జరిమానా, యాజమానికి రూ.6 నెలల జైలుశిక్ష ఉంటుందని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news