ఆ రూల్ వైసీపీకి లేదా..బాబు-పవన్‌ని ఆపలేరా.!

-

ఏదేమైనా గాని వైసీపీ అధికారంలోకి వచ్చాక అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. అలాగే ప్రతిపక్ష టీడీపీకి చెక్ పెట్టేలా వైసీపీ దూకుడుగా వెళుతుంది. ఇప్పటికే పలు నిర్ణయాలతో వైసీపీ..టీడీపీని నిలువరించే ప్రయత్నాలు చేసింది. ఇదే క్రమంలో తాజాగా చంద్రబాబుకు చెక్ పెట్టేలా ఒక నిర్ణయం తీసుకున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇటీవల చంద్రబాబు రోడ్ షోలకు భారీ స్థాయిలోనే జనం వస్తున్నారు. ఇదే క్రమంలో కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు.

బాబు ప్రచార పిచ్చితోనే ఈ ఘటనలు జరిగాయని వైసీపీ అంటుంది..సరిగా పోలీసుల సెక్యూరిటీ ఇవ్వకపోవడం, అలాగే ఈ ఘటనల వెనుక వైసీపీ కుట్ర దాగి ఉందని టీడీపీ ఆరోపించింది. ఇదే నేపథ్యంలో రోడ్లపై ర్యాలీలు, సభలు నిర్వహించడానికి వీలు లేదని జగన్ ప్రభుత్వం రాత్రికి రాత్రే ఓ జీవో తీసుకొచ్చింది. అయితే బాబు రోడ్ షోలకు జనం రావడం, తర్వాత నారా లోకేష్ పాదయాత్ర ఉండటం, పవన్ బస్సు యాత్ర ఉండటంతోనే జగన్ ఈ జీవో తీసుకొచ్చారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

అయితే ఈ జీవో వైసీపీకి కూడా వర్తిస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కానీ పేరుకే వైసీపీకి రూల్ అని, ఆ రూల్ వైసీపీకి వర్తించడం లేదని విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ జీవో వచ్చిన కొన్ని గంటల్లో జగన్..రాజమండ్రిలో రోడ్ షో నిర్వహించారు. అటు విజయనగరంలో వైసీపీ నేతలు ర్యాలీ చేశారు. మరి వారిపై పోలీసులు ఆంక్షలు పెట్టలేదని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి.

కావాలని ప్రతిపక్షాలని జనంలోకి వెళ్లకుండా చేయడం కోసం ఈ జీవో తెచ్చారని మండిపడుతున్నారు. ఇక ఈ జీవోపై కోర్టుకు వెళ్లడానికి ప్రతిపక్షాలు రెడీ అవుతున్నాయి. అక్కడ వైసీపీకి ఎదురుదెబ్బ తగలడం ఖాయమని టీడీపీ-జనసేన శ్రేణులు అంటున్నాయి. అయితే ఈ జీవో అమలుతో ప్రస్తుతం కుప్పం టూర్‌కు వెళుతున్న చంద్రబాబుకు పలు ఆంక్షలు పెడుతున్నారు. మరి చూడాలి వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు ఎలా చూస్తారో.

Read more RELATED
Recommended to you

Exit mobile version