దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల పై వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి రిలీఫ్ కలగనుంది. కొత్త ఎఫ్‌డీలకు అలాగే రెన్యూవల్ చేసుకునే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఇవి వర్తిస్తాయి. ఇక పూర్తి వివరాలని చూస్తే కొత్త ఎఫ్‌డీలకు, రెన్యూవల్ చేసుకునే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు ఈ వడ్డీ రేట్లు పెంచింది.
ఈ కొత్త మార్పులని జనవరి 3 నుంచి చేసింది బ్యాంకు. కనుక ఇప్పటి నుండి కస్టమర్లకు 4.5 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ వస్తుంది. అదే ఒకవేళ సీనియర్ సిటిజన్స్‌కు అయితే 5 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ వస్తుంది. 7 రోజుల నుంచి పదేళ్ల టెన్యూర్‌కు కూడా ఇవే వడ్డీ. ఇక వడ్డీ కి సంబంధించి పూర్తి వివరాలని చూస్తే..
7 రోజుల నుంచి 29 రోజుల ఎఫ్‌డీలపై 4.5 శాతం వడ్డీ వస్తుంది. 30 రోజుల నుంచి 45 రోజులకి 5.25 శాతం, 46 రోజుల నుంచి 60 రోజుల ఎఫ్‌డీలపై 5.5 శాతం, 61 రోజుల నుంచి 89 రోజులకి 5.75 శాతం, 90 రోజుల నుంచి 6 నెలల ఎఫ్‌డీలపై 6.25 శాతంగా వుంది. 6 నెలల నుంచి 9 నెలలకి 6.5 శాతంగా ఉంది. 9 నెలల నుంచి ఏడాది కి 6.65 శాతం వడ్డీ వస్తుంది. ఏడాది నుంచి 15 నెలలకి 6.75 శాతం, 15 నెలల నుంచి 2 ఏళ్ల కి 7.15 శాతం వడ్డీ ఉంది. రెండేళ్ల నుంచి పదేళ్లకి 7 శాతంగా ఉంది. అదే సీనియర్ సిటిజన్స్‌కు అదనపు వడ్డీ వస్తుంది.