రైతుబంధు అందించ‌డానికి నిధుల కొర‌త లేదు : మంత్రి నిరంజ‌న్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు ప‌థ‌కాన్ని రైతుల‌కు అందించ‌డానికి నిధుల కొర‌త లేద‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. నేడు రైతు బంధు ఉత్స‌వాల్లో ఆయ‌న రైతు బంధు ప‌థ‌కం గురంచి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రైతు బంధు ప‌థ‌కాన్ని అర్హులు అయిన ప్ర‌తి ఒక్క రైతుకు అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అలాగే సోమ‌వారం ఐదో రోజు రైతు బంధు డ‌బ్బులు రైతుల అకౌంట్ ల‌లో జ‌మ అయ్యాయ‌ని తెలిపారు. నేడు రూ. 1047.41 కోట్లు విడుద‌ల అయ్యాయ‌ని తెలిపారు. వీటితో నేడు 4,89,189 మంది రైతుల ఖాతాల్లో జ‌మ చేశామ‌ని తెలిపారు.

ఈ సారి రూ. 5,294 కోట్ల‌ను 57,60,280 మందికి పంపిణీ చేశామ‌ని తెలిపారు. అలాగే రైతు బంధు ప‌థ‌కం ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో రూ. 50 వేల కోట్ల‌ను రైతుల ఖాతాలో జ‌మ చేశామ‌ని ప్ర‌క‌టించారు. అందుకే నేటి నుంచి జ‌న‌వ‌రి 10 వ‌ర‌కు రైతు బంధు దినోత్స‌వాలు నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. ఈ ఉత్స‌వాల్లో భాగంగా ప్ర‌తి ఇంటి ముందు రైతు బంధు ప‌థ‌కానికి సంబంధించిన ముగ్గులు వేయాల‌ని కోరారు. అలాగే విద్యార్థుల‌కు వ్యాస ర‌చ‌న‌, ఉపన్యాస, పెయింటింగ్ వంటి పోటీలను నిర్వ‌హించాల‌ని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news