గర్భిణులకు వ్యాక్సిన్ ఇవ్వద్దు.. కేంద్రం..

-

కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవ్యాక్సిన్, సీరం ఇన్స్టిట్యూట్ రూపొందించిన కోవిషీల్డ్ మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ఈ రెండు వ్యాక్సిన్లకి భారత ప్రభుత్వం నుండి ఆమోదం లభించింది. కేంద్ర నుండి రాష్ట్రాలకి వ్యాక్సిన్ల డోసులు పంపించబడ్డాయి కూడా. మరికొద్ది రోజుల్లో కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ టీకాలు వేయనున్నారు. ఆ తర్వాత సామాన్య ప్రజానీకానికి వ్యాక్సిన్ అందుబాటులో ఉండనుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ గురించిన అనేక వివరాలు తెలుసుకోవాల్సి ఉంది.

గర్భిణ్ణులకు వ్యాక్సిన్ వేయకూడదని కేంద్రం స్పష్టం చేసింది. గర్భం దాల్చినవారు, పాలిచ్చే తల్లులకి వ్యాక్సిన్ వేయకూడదని తెలిపింది. గర్భం వచ్చిందనే అనుమానాలు ఉన్నా సరే, వ్యాక్సిన్ వేయించుకోకూడదని తెలిపింది. కరోనా వ్యాక్సిన్ ని రెండు డోసులు ఇస్తారట. మొదట 14రోజుల తర్వాత సెకండ్ డోస్ వేస్తారు. మొత్త 28రోజుల తర్వాతే యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయట.

Read more RELATED
Recommended to you

Exit mobile version