గ్రేటర్ ఎన్నికల పోలింగ్ కొద్ది సేపటి క్రితమే మొదలయింది. ఉదయం 7 గంటల నుంచి ఈ ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం ఆరు గంటల దాకా సాగనుంది. అయితే నిజానికి చాలా మందికి ఓటర్లకి ఓటర్ స్లిప్ లు అంద లేదు. గతంలో పార్టీలు కూడా శ్రద్ధ తీసుకుని ఈ స్లిప్ లు పంచేవి కానీ ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎవరూ పంచ లేడు. అయితే అలాంటి వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓటర్ స్లిప్ లను నేరుగా ఇంటర్నెట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
అలా చేసుకుని నేరుగా వెళ్లి వోటు వేసి రావచ్చు. ఓటర్ స్లిప్ కోసం ఇంటర్నెట్ లో http://voterslipulb.tsec.gov.in/voterslip.do లింక్ ఓపెన్ చేయాలి. అందులో కోరిన వివరాలు అంటే మీరు పేరు, వోటర్ నెం లాంటివి నమోదు చేస్తే మీ ఓటర్ స్లిప్ వస్తుంది. లేదంటే http://searchvoterslipulb.tsec.gov.in/downloadvoterslipulb.do ఓపెన్ చేసి వార్డు వివరాలు, పేరు, చిరునామా నమోదు చేసి కూడా ఓటర్ స్లిప్ పొందవచ్చు. లేదా https://electoralsearch.in/ లింక్ ద్వారా మీ ఓటర్ కార్డు వివరాలు పొందవచ్చు. ఓటర్ స్లిప్ కనుక తీసుకుంటే మీరు వోటు వేయడం మరింత సులభతరం అవుతుంది.