వామ్మో.. ఆ పాము ఖరీదు రూ.1.25 కోట్లు.. ఎందుకో తెలుసా..?

-

పాములు అంటే చాల మందికి భయం పుడుతుంది. కాని కొంతమందికి ఆ పాములని ఆడించటమే జీవనాధారంగా చేసుకుని బ్రతుకుతూ ఉంటారు. మరికొంతమంది విషపూరిత  పాములు పట్టడం, పాము కాటుకు నాటు వైద్యం చేయటం వృత్తిగా ఎన్నుకొని జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కానీ పాములలో విషపూరితమైనవే కాదు ,విషరహిత పాములు కూడా ఉంటాయి. అలంటి పాములకి అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ ఎక్కువ. కొంతమంది స్వార్ధపరులు వీటిని కూడా వారి స్వలాభానికి వాడుకుంటారు. ఇలాంటి ఒక సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.

 

అత్యంత డిమాండు ఉన్న ఓ విషరహిత పామును మధ్యప్రదేశ్‌ పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.ఈ పాము అరుదైన జాతికి చెందిన రెండు తలల పాము. దీని ఖరీదు రూ.1.25 కోట్లు.ఈ పామును మధ్యప్రదేశ్ లోని నర్సింగ్ కు చెందిన అయిదుగురు సభ్యుల ముఠా విక్రయించాటానికై ప్రయత్నిస్తూ ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అయిదుగురు సభ్యులలో ముగ్గురు మైనర్లు అని తెలిపారు పోలీసులు. వీరు నర్సింగ్  బస్టాండ్ లో సెల్ ఫోన్ లో పాము విక్రయం గురించి మాట్లాడుతుండగా స్థానికులు అది గమనించి పోలీసులకి సమాచారాన్ని అందించారు.

దానితో అక్కడికి వచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని, పాముని స్వాధీనం చేసుకున్నురు.ఈ పాము పేరు ‘ రెడ్ సాండ్ బో ‘ ఈ విషరహిత పాముని నుంచి ఖరీదైన మెడిసిన్స్, కాస్మోటిక్స్ కూడా తాయారు చేస్తారట. అంతే కాదు దీనిని చేతబడిలో వాడతారు అట, ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే దీనిని ఇంట్లో పెంచుకుంటే మంచిదంటూ కూడా కొంత మంది నమ్ముతూ ఉంటారట. అందుకే అంతర్జాతీయ మార్కెట్ లో ఈ పాముకు అంత డిమాండ్ మరి. ఈ పాముని పేహోర్ జిల్లలో ఉన్న అరణ్య ప్రాంతంలో పట్టుకొని రూ. 1.25 కోట్లకి అమ్మటానికి తీసుకువచ్చారు ఆ అయిదుగురు సభ్యుల ముఠా. అందువల్ల వారిపై అదనంగా వన్యప్రాణి రక్షణ చట్టం కింద మరో కేసును నమోదు చేసినట్లు పోలీసు అధికారి కైలాస్‌ భరద్వాజ్‌  వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version