ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు బలపడినట్టే అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినిపించాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్నేహం, ఉమ్మడిగా వాళ్ళు రెండు రాష్ట్రాలను ముందుకు తీసుకు వెళ్ళాలి అనుకున్న తీరు అందరిని సంతోషపరిచింది. పరిష్కారం కాని విభజన సమస్యలను పరిష్కరించడం, గోదావరి జలాల విషయంలో తీసుకున్న నిర్ణయం, రాయలసీమకు నీరు ఇవ్వాలనుకున్న సంకల్పం అన్ని కూడా ప్రజలను సంతోష పెట్టాయి.
ప్రస్తుతం ఆ నిర్ణయాలకు కొన్నింటికి బ్రేక్ పడినా తెలంగాణా, ఏపీ స్నేహం మాత్రం బాగానే ఉంది. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ పర్యటనకు తెలంగాణా మంత్రి కేటిఆర్ వెళ్తున్నట్టు తెలుస్తుంది. జగన్ ప్రవేశ పెట్టిన కొన్ని కార్యక్రమాలను నేరుగా జగన్ కేబినేట్ మంత్రులను అడిగి తెలుసుకునే ఆలోచనలో కేటిఆర్ ఉన్నారట. ఇక దిశా చట్టం విషయంలో కూడా జగన్ ప్రభుత్వం నుంచి కొన్ని సూచనలను తీసుకునే యోచనలో కేటిఆర్ ఉన్నారట. ఇక స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు అనే చట్టానికి సంబంధించిన,
వివరాలతో పాటుగా, రిజర్వేషన్ల విషయంలో జగన్ అనుసరిస్తున్న కొన్ని విధానాలను తెలుసుకునే యోచనలో కేటిఆర్ ఉన్నారట. ఇక మూడు రాజధానుల ప్రకటన విషయంలో కూడా అసలు జగన్ ఆలోచన ఏంటీ అనేది కూడా కేటిఆర్ తెలుసుకునే ప్రయత్నం చేస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సంక్రాంతి తర్వాత లేదా ఫిబ్రవరిలో ఆయన పర్యాటన ఉండే అవకాశం ఉందని అంటున్నారు. కాగా జగన్ పాలన బాగుంది అంటూ కేటిఆర్ తాజాగా సోషల్ మీడియాలో ఒక చర్చలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.