స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించలేదన్న కోపంతో అధికార పార్టీ నాయకులు గ్రామ సచివాలయ సిబ్బందిని బయటకు పంపి, కార్యాలయానికి తాళం వేసిన ఘటన కదిరిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా కదిరి మండలం కే.బ్రాహ్మణపల్లి గ్రామ సచివాలయ సిబ్బంది పై అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషలాడారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున పతాకావిష్కరణకు నన్నెందుకు ఆహ్వానించలేదని వారిపై నోటికొచ్చినట్టు విరుచుకుపడ్డారు.
అనంతరం సిబ్బందిని బయటకు పంపి గ్రామ సచివాలయానికి తాళం వేశారు.తనను గుర్తించని సిబ్బంది మాకు అవసరం లేదంటూ సచివాలయం ఎదుటనే బైఠాయించారు. సచివాలయ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు సదరు నాయకుడితో ఫోన్ లో మాట్లాడిన ఫలితం లేకపోయిందని సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కే.బ్రాహ్మణపల్లికి చేరుకొని అధికార పార్టీ నాయకుడికి నచ్చజెప్పి తాళం తీయించారు. ఈ విధంగా కరోనా లాంటి కష్ట సమయంలో ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులను ప్రభుత్వ ఉద్యోగులు చేయడం చాలా బాధాకరం.