ఏపీలో ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహాణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. ఈ నెల 28న రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ కానున్నారు. మరో పక్క ఏమో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రస్తుతం లేదని అంటున్నారు ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి. నవంబర్, డిసెంబర్ నెలలో మరోసారి వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు ఉన్నాయని, దసరా తరువాత సెకెండ్ వేవ్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.
అయితే బీహార్ ఎన్నికలు ఖచ్చితంగా జరగాల్సిన రాష్ట్ర ఎన్నికలు కావున నిర్వహిస్తున్నారని, రాష్ట్ర ఎన్నికలు రాజ్యాంగ ప్రకారం జరిగి తీరాల్సిందేనని వాటితో.. స్థానిక సంస్థలు పోల్చకూడదని అయన అన్నారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో ఎన్నికలు నిర్వహణపై ఎస్ఈసీ శ్రద్ధ చూపిస్తోంది. ఇక గతంలో జరిగిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి కొత్తగా మళ్లీ ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.