స‌మ‌స్య జ‌గ‌న్‌కే కాదు…. బాబు బుక్ అయ్యేందుకు ఆ ఒక్క కేసు చాలు…!

-

నేరచరితులను చట్టసభల్లోకి అడుగుపెట్టనీయకుండా చూడాలన్న సుప్రింకోర్టు తాజా ఆదేశాలు రాజకీయ పార్టీల్లో కలకలం సృష్టిస్తున్న మాట వాస్తవం. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులు, ఉన్న స్టేలను ఏడాదిలోగా విచారణ జరిపించాలంటూ సుప్రింకోర్టు తాజాగా ఆదేశాలిచ్చింది. కేసులను తొందరగా విచారణ చేయించేందుకు ప్రత్యేకకోర్టులు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది. సుప్రింకోర్టు లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా సుమారు 4600 మంది ప్రజాప్రతినిధులు కేసులను ఎదుర్కొంటున్నారట.

సరే కోర్టుల ఏర్పాటు, కేసుల విచారణ, శిక్షలు ఖరారు లాంటివి ఎంతవరకు అమలవుతాయన్న విషయాన్ని పక్కనపెట్టేద్దాం. ఇక్కడ గడచిన మూడు రోజులుగా టిడిపి ఓ విషయాన్ని విస్త్రతంగా ప్రచారంలోకి తీసుకొస్తోంది. అదేమంటే సుప్రింకోర్టు తాజా ఆదేశాల వల్ల జగన్ పైన విచారణ జరుగుతున్న కేసులన్నీ తొందరగా విచారణ అయిపోతాయంటూ సంబరపడుతున్నారు. కేసుల విచారణ జరిగితే జగన్ కు మళ్ళీ జైలు ఖాయమంటూ హ్యాపీగా ఫీలైపోతున్నారు. అంటే టిడిపి నేతల ఉద్దేశ్యం ప్రకారం చంద్రబాబుకు రాష్ట్రంలో తిరుగేలేదన్నట్లుగా మాట్లాడుతున్నారు.

కానీ వాళ్ళు మరచిపోయిందేమంటే సుప్రింకోర్టు ఆదేశాలు జగన్ కు ఇబ్బందిగా మారితే ఇదే ఆదేశాలు చంద్రబాబునాయుడుకు కూడా ఇబ్బందిగా మారుతాయన్న విషయాన్ని కన్వీనియంట్ గా మర్చిపోతున్నారు. ఇదే విషయమై బిజెపి అధికారప్రతినిధి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు 16 కేసుల్లో విచారణ జరక్కుండా స్టేలపై కంటిన్యు అవుతున్న విషయం అందరికీ తెలుసన్నారు. ఆ కేసులు కూడా సుప్రింకోర్టు పుణ్యమా అని ఇపుడు విచారణ జరుగుతుందని ఆశించారు. అలాటే 16 కేసుల స్టేల సంగతిని పక్కనపెట్టేస్తే  ఒక్క ’ఓటుకునోటు’ కేసు చాలన్నారు.

నిజానికి ఓటుకునోటు కేసులో విచారణ జరిగుంటే చంద్రబాబు ఎప్పుడో జైలుకు వెళ్లుండే వారన్న విషయాన్ని రెడ్డి గుర్తుచేశారు. చంద్రబాబుపై నమోదైన మిగిలిన కేసుల సంగతిని పక్కనపెట్టేసినా ఓటుకునోటు కేసు మాత్రం అందరికీ తెలిసిన కేసంటూ రెడ్డి గుర్తుచేశారు. ఆరోపణలు ఎదుర్కోవటంలో కేసులు నమోదవ్వటంలో వైసిపి నేతలకు టిడిపి నేతలకు పెద్దగా తేగా ఏమీ లేదని అభిప్రాయపడ్డారు. కాబట్టి నేరచరితులను చట్టసభల్లోకి అడుగుపెట్టనీయకూడదన్న సుప్రింకోర్టు అభిప్రాయం ఆహ్వానించతగ్గ పరిణామం అంటూ అభివర్ణించారు. మరి బిజెపి నేత అభిప్రాయపడినట్లు సుప్రింకోర్టు తాజా ఆదేశాలు ఎవరికి ఇబ్బందులు కలిగిస్తాయో చూద్దాం.

-Vuyyuru Subhash 

Read more RELATED
Recommended to you

Exit mobile version