టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ హీరోయిన్ కన్నుమూశారు. ప్రముఖ నటి పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి సరోజ దేవి కాసేపటి క్రితమే మృతి చెందారు. బెంగళూరులోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు ప్రముఖ నటి సరోజా దేవి.

కన్నడ, తెలుగు అలాగే తమిళ భాషలలో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు అలాగే ఎంజీఆర్ లాంటి దగ్గర నటులతో కూడా సినిమాలు చేశారు నటి సరోజా దేవి. మహాకవి కాళిదాస అనే కన్నడ సినిమాతో 1955 సంవత్సరంలో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తెలుగులో ఇంటికి దీపం ఇల్లాలే, మంచి చెడు, దాగుడుమూతలు పండంటి కాపురం, దానవీరశూరకర్ణ అలాగే అల్లుడు దిద్దిన కాపురం లాంటి సినిమాల్లో నటించారు.