రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పై అభ్యంతరకర ట్వీట్ చేసిన రాంగోపాల్ వర్మ కు నోటీసులు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. తొలి ఆదివాసి మహిళా రాష్ట్రపతి అభ్యర్థిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. మానవ అక్రమ రవాణా పై ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ బ్యూరో ఆఫ్ పోలీస్ రిసెర్చ్ డెవలప్మెంట్ సంయుక్తంగా అవగాహన సదస్సు నిర్వహించింది.
ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ… వర్మ తన ట్విటర్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆమె కోరారు. మహిళల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తుందని చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన కార్యాచరణ ప్రణాళిక ను జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మ కు నివేదించినట్లు ఆమె వెల్లడించారు. మానవ అక్రమ రవాణా నిరోధానికి పోలీస్ శాఖ సమన్వయంతో మహిళా కమిషన్ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఆర్జివి ఇలాంటి ట్వీట్లు చేయడం… దారుణమని మండిపడ్డారు వాసిరెడ్డి పద్మ.