నేడు తెలంగాణ పదవ తరగతి పరీక్షల ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి

-

తెలంగాణ పదోతరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ పదోతరగతి ఫలితాలు ఇవాళ రిలీజ్ కానున్నాయి. తెలంగాణ లో పదోతరగతి పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఇంటర్మీడియట్.. పదోతరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.

Telangana Class 10th Exam Results Today.

ఇక తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఎప్పుడు విడుదలవుతాయని ఆసక్తి ఉండటంతో తాజాగా పదోతరగతి బోర్డు అధికారులు క్లారిటీ ఇచ్చారు. పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేశామని.. ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయమంటే అప్పుడు విడుదల చేస్తామని తెలిపారు. ఇక ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. తెలంగాణ పదోతరగతి ఫలితాల కోసం bse.telangana.gov.in వెబ్ సైట్ సంప్రదిస్తే సరిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news