తెలంగాణ నిరుద్యోగులకు మంత్రి హారీష్ రావు శుభవార్త చెప్పారు. వచ్చే వారంలోనే పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు స్ఫష్టం చేశారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… దేశంలోనే ప్రతి జిల్లా లో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. మెదక్ జిల్లాకు త్వరలోనే మరో మెడికల్ కాలేజ్ అని తెలిపారు. త్వరలో పటాన్ చేరు లో 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆసుపత్రుల నిర్వహణలో తెలంగాణ మూడవ స్థానంలోఉందని ప్రకటన చేశారు. వచ్చే 15 రోజుల పాటు హెల్త్ క్యాంపులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు మంత్రి హరీష్ రావు. వినియోగించుకొని ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడు కోవాలని కోరారు. తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామని ప్రకటించారు.