జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీ మాతా వైష్ణోదేవి (ఎస్‌ఎంవీడీ) ష్రైన్ బోర్డు భక్తులకు శుభవార్త చెప్పింది. ఇకపై భక్తులు ఆ దేవి ప్రసాదాన్ని స్పీడ్ పోస్టులో పొందవచ్చు. కరోనా నేపథ్యంలో ఆలయానికి రాలేకపోతున్న భక్తులకు ప్రసాదాన్ని స్పీడ్ పోస్టు ద్వారా అందజేయాలని నిర్ణయించారు. అందువల్ల భక్తులు ఇకపై ఆ దేవి ప్రసాదాన్ని స్పీడ్ పోస్టులో తెప్పించుకోవచ్చు.
ఆలయ కమిటీ సీఈవో రమేష్ కుమార్, జమ్మూ కాశ్మీర్ పోస్టల్ సర్వీస్ డైరెక్టర్ గౌరవ్ శ్రీవాత్సవ ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. కాట్రాలోని స్పిరిచువల్ గ్రోత్ సెంటర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇరువురి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో భక్తులు ఆలయ అధికారిక వెబ్‌సైట్ లేదా ఫోన్ ద్వారా ప్రసాదాన్ని ఆర్డర్ చేయవచ్చు. వారికి స్పీడ్ పోస్ట్‌లో ప్రసాదాన్ని డెలివరీ చేస్తారు.
కరోనా నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో చాలా ఆలయాలకు భక్తులు వెళ్లలేకపోతున్నారు. అయితే వైష్ణోదేవి ప్రసాదాన్ని ఈ రూపంలో అయినా భక్తులకు అందజేయాలని సంకల్పించారు. అందువల్లే ఆలయ కమిటీ ఈ కార్యక్రమం చేపట్టింది.