ఎస్బీఐ కస్టమర్లకు ఇప్పటి నుండి ఈ ఛార్జీలు లేవు..!

-

ఎస్బీఐ కస్టమర్లకు మరో శుభవార్త. ఎస్బీఐ వినియోగదారుల కోసం కొత్త సర్వీసును ప్రారంభించింది. అయితే దీనికోసం సింపుల్ గా ప్లే స్టోర్ నుంచి యోనో యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు డబ్బులు తీసుకోవడం కోసం ఏటీఎం పై ఆధార పడక తప్పని స్థితి వచ్చింది. అయితే ఏ ఊరైనా ఏ ప్రదేశమైనా తప్పకుండా ఏటీఎం కి వెళ్లి డబ్బులు తీసుకోవాల్సి వస్తోంది. అయితే చాలా ఏటీఎం లో నగదు పరిమితికి మించి తీస్తే వాటిపై చార్జీలు వసూలు చేస్తున్నారు. కనుక ఈ విషయం పై తాజాగా ఎస్బీఐ కొత్త నిర్ణయాన్ని తీసుకొచ్చింది.

SBI

అయితే ఈ చార్జెస్ నివారించడానికి ఎస్బీఐ తన వినియోగదారులకు వెసులుబాటు కల్పించింది ఏటీఎం కార్డు లేకుండా యోనో యాప్ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ఎటువంటి రుసుము కూడా చెల్లించనవసరం లేదు. అయితే ఇలా ఈ అవకాశాన్ని మీరు కనుక పొందాలంటే ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి ఆ తర్వాత మీరు నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి మరియు పాస్ వర్డ్ ని నమోదు చేయాలి. ఆ తర్వాత లాగిన్ పై క్లిక్ చేయాలి ఇలా లాగిన్ అయిన తర్వాత మీకు డాష్ బోర్డు కనిపిస్తుంది.

దీనిలో మీరు మీ ఖాతా యొక్క సమాచారాన్ని పూర్తిగా చూడవచ్చు. ఇప్పుడు మీరు కార్డు లేకుండా నగదు ఉపసంహరించుకోవడానికి వెబ్సైట్ లోని మై రివార్డ్ విభాగంలో కిందకి స్క్రోల్ చేయండి. ఇప్పుడు మీకు ఆరు ఆప్షన్లు కనిపిస్తాయి. మీరు యోనో కాష్ పై క్లిక్ చేయండి ఇందులో మీకు రోజువారి లావాదేవీ పరిమితి గురించి పూర్తి సమాచారం కనిపిస్తుంది. దీని ద్వారా మీరు రూ. 500 నుంచి 10 వేల వరకు తీసుకోవచ్చు. దీని ద్వారా మీరు ఎస్బీఐ ఏటీఎం నుంచి యోనో ద్వారా గరిష్టంగా 20 వేల వరకు ఉపసంహరించుకోవచ్చు. ఏ చార్జీలు పడవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version