ఇప్పుడు రైలులో కావల్సిన ఆహారం ఆర్డర్ చేసుకోవచ్చు..!

-

చాలా మందికి రైలు లో ప్రయాణం చెయ్యాలంటే ఆహారం కి సంబంధించి ఏదో ఒక భయం ఉంటుంది. కానీ ఇక నుండి ఆ భయం అక్కర్లేదు. ఎదుకంటే IRCTC మన కోసం ఓ సదుపాయాన్ని కల్పిస్తోంది. మాములుగా అయితే ప్యాంటీ కార్ లో లభించే ఫుడ్ కొనుగోలు చేసి తినాల్సి ఉంటుంది అయితే అలా కాకుండా నచ్చిన ఫుడ్ ని ఇక మనం ఎంపిక చేసుకోవచ్చట.

IRCTC

రైల్వే బోర్డు రైళ్లలో ఆహారం విషయంలో ఓ కీలక నిర్ణయం ని తీసుకోవడం జరిగింది. ట్రైన్‌లో ప్రాంతీయ, స్థానిక వంటలకు ప్రాధాన్యమిచ్చేందుకు నిర్ణయించింది. అలానే మాములు వారికీ మాత్రమే కాక మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారికి, చిన్నారులకు కూడా స్పెషల్ ఫుడ్ ని అందించనుంది. వీళ్ళకి కూడా అనుకూలంగా ఉండాలని మెనూ లో మార్పులు చేసింది ఐఆర్‌సీటీసీ.

కేటరింగ్‌ విభాగాన్ని మరింత మెరుగుపరచడంతో పాటు ప్రయాణికులకు ఆహారం విషయంలో మరిన్ని ఆప్షన్స్ ఉండాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందట. ఈ మెనూ లో ప్రాంతీయ వంటకాలు, సీజనల్‌ వంటకాలే కాకుండా పండగ రోజుల్లో ప్రత్యేక ఆహారాన్ని కూడా అందించేందుకు ఐఆర్‌సీటీసీకి రైల్వే బోర్డు అవకాశం కల్పించింది. తృణధాన్యాలతో తయారు చేసిన ఆహారాన్ని మధుమేహ వ్యాధిగ్రస్తులుకు, చిన్నారులకు ఇచ్చే విధంగా మార్పులు చేస్తున్నారు. దీనితో ప్రయాణికులకు ఆహారం లో ఎలాంటి సమస్యలు కలగవు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version