హీరోయిన్ గా ఎదగాల్సిన నన్ను ఇలా చేశారంటున్న హీరోయిన్ ప్రేమ..!!

-

ఒకప్పటి అందాల తార ప్రేమ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. అప్పట్లో ప్రేమ ఎక్కువగా డివోషనల్ కు సంబంధించిన సినిమాలలోని నటించేది. అంతేకాకుండా దేవతలు నిజంగానే ఇలా ఉంటారేమో అనే విధంగా ఆ పాత్రలతో మరింతగా ప్రేక్షకులను అలరించేది. అయితే అటువంటి దేవత పాత్రలు కేవలం ప్రేమ కు మాత్రమే సొంతం అనే విధంగా గుర్తింపు తెచ్చుకుంది ప్రేమ. గ్లామర్ పాత్రలు కూడా చేస్తూ భారీగా అభిమానులను సొంతం చేసుకున్న ఈమె.. డాక్టరేట్ కూడా పొందారు. విక్టరీ వెంకటేష్ నిర్మించిన ధర్మచక్రం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. మొదటి సినిమాతోనే భారీగా క్రేజ్ అందుకున్న ప్రేమ ఆ తర్వాత స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు.

అందుకు తగ్గట్టుగానే వరుసగా సినిమా అవకాశాలు కూడా వచ్చాయి . మరి ప్రేమ నటించిన సినిమాలలో దేవి సినిమా సంచలన విజయం సాధించింది. సినిమా తర్వాత ఈమె క్రేజ్ కూడా ఒక్కసారిగా మారిపోయింది. ఇకపోతే ప్రస్తుతం ప్రేమ సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. హీరోయిన్గా అవకాశాలు అందుకో లేకపోయినా అడపాదడపా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి సీనియర్ యాక్టర్ నరసింహారాజుతో కలిసి హాజరయ్యింది. ఇందులో ఎన్నో విషయాలను ఆమె పంచుకుంది.

సతీష్ కి హీరోయిన్ గా ఉన్న తాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎందుకు మారాల్సి వచ్చిందో కూడా వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ చిరుగాలి సినిమా సమయం వరకు నేను హీరోయిన్గా మంచి పొజిషన్లో ఉన్నాను . అయితే ఈ సినిమా కాన్సెప్ట్ నచ్చడంతో పాటు నా పాత్ర ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయింది. అందుకే ఈ చిత్రాన్ని చేయడానికి ఒప్పుకున్నాను. ఇందులో నా పాత్రను ప్రేక్షకులు బాగా ఆదరించారు ..ఈ పాటను సరిగ్గా వింటే ఈ పాటలో ఎంతో అర్థం కనిపిస్తుంది. ఆ పాట ” సంతోషం సగం బలం.. హాయిగా నవ్వమ్మ”.. అనే పాట అంటే చాలా ఇష్టం . ఇక ఈ సినిమా తర్వాత నుంచి సహాయనటిగా మారిపోయాను అంటూ చెప్పుకొచ్చింది ప్రేమ. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా చేయకపోవడంతో తదుపరి చిత్రాలకు కూడా నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయవలసి వచ్చింది అంటూ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version