ఇండియా వేదికగా వివిధ దేశాల జాతీయ భద్రత సలహాదారుల సమావేశం నవంబర్ 10న ఢిల్లీలో జరుగనుంది. రీజినల్ సెక్యూరిటీ డైలాగ్ పేరిట ఆప్ఘనిస్తాన్ అంశంపై చర్చించనున్నారు. ప్రాంతీయ భద్రతపై సమావేశంలో వివిధ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు చర్చిస్తారు. ఈ చర్చలకు భారత్ తరుపున ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్ అధ్యక్షత వహిస్తారు. ఆప్ఘనిస్తాన్ కు పొరుగున ఉన్న దేశాలనే కాకుండా దక్షిణ ఆసియాలోని పలు దేశాలను ఇండియా ఆహ్వనించింది. రష్యా, ఇరాన్, పాకిస్తాన్, చైనా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలను ఇండియా అధికారికంగా ఆహ్వనించింది. ఈ సమావేశాలకు పాకిస్తాన్ తిరస్కరించింది. కాాగా చైనా ఇప్పటి వరకు ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేదు. మిగతా దేశాలు సమావేశానికి హాజరుకానున్నాయి. ఆప్ఘనిస్తాన్ లో నెలకొన్న పరిస్థితులు, ప్రాంతీయ భద్రత, శాంతి అంశాలపై చర్చలు జరుగుతాయి. ఇదివరకు జాతీయ భద్రతా సమావేశాలు 2018,2019 లో ఇరాన్ లో జరిగాయి. ఆతరువాతి ఏడాది భారత్ లో జరగాల్సి ఉన్నా.. కోవిడ్ పాండమిక్ కారణంగా సమావేశాల నిర్వహణ జరగలేదు. ప్రస్తుతం ఇండియాలోని ఢిల్లీలో జాతీయ భద్రత సలహాదారుల సమావేశాలు జరుగుతున్నాయి.