కాలర్ ఎగరేస్తున్న జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్..!

-

జూ ఎన్టీఆర్ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఇప్పటికీ తెలుగు సినిమా హీరోలలో ఎవరు బెస్ట్ డాన్సర్ అంటే చాలా మంది జూ ఎన్టీఆర్ పేరే చెబుతారు. రీసెంట్ గా రాజ మౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ మూవీ లో తన నటన తో  భారత దేశంలో లోనే కాక ,హాలీవుడ్ వాళ్ళను సైతం ఆశ్చర్యపరిచాడు.

ఇప్పటికే ఆస్కార్‌ బరిలో నిలిచిన ఈ మూవీ అనేక అవార్డులు సాధిస్తోంది.ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డును గెలుచుకోగా, లాస్ ఏంజెలీస్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డుకు అడుగు దూరంలో ఆగి పోయారు.  ఇక బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎమ్‌ఎమ్‌ కిరవాణి లాస్ ఏంజెలీస్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డును గెలుచుకున్నారు. ఇప్పుడు జూ ఎన్టీఆర్ వంతు వచ్చింది.

రీసెంట్ గా  అమెరికన్ వెరైటీ` మ్యాగజీన్‌ ప్రకటించిన టాప్‌ 10 బెస్ట్ యాక్టర్స్ లిస్ట్ లో ఎన్టీఆర్‌ పేరు కూడా ఉండడం మనకు గర్వకారణం . అసలు ఇలాంటి వాటిలో మన దేశపు నటులను కనీసం పరిగణ లోకి తీసుకోని పరిస్థితులలో తారక్ టాప్ లెవెల్ ఉండటం సూపర్ అంటే సూపర్.  ఈ లిస్ట్ లో విల్‌ స్మిత్‌, హ్యూ జాక్మన్‌ వంటి ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ ఉండటం వారితో జూ ఎన్టీఆర్  ఉండటం  ఇంకా విశేషం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version