మళ్ళీ కొరటాలను లైన్లో పెట్టిన ఎన్టీఆర్…!

-

జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమాలపై అభిమానులకు ఎప్పటికప్పుడు ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. అతనికి ఫాలోయింగ్ ఎక్కువ కావడం తో దర్శకులు కూడా చాలా జాగ్రత్తగా కథలను సిద్దం చేసుకుంటూ ఉంటారు. చిన్న చిన్న దర్శకులు ఆయనతో సినిమా చేసే ప్రయత్నాలు అసలు చేయరు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్… దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

ఆర్ఆర్ఆర్ అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్… త్రివిక్రమ్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల అవుతుంది. ఇది పక్కన పెడితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్… తర్వాతి సినిమా కొరటాల శివతో చేయడానికి రెడీ అయ్యాడు.

కొరటాల శివతో జనతా గ్యారేజ్ సినిమా చేసాడు ఎన్టీఆర్. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అప్పుడే మళ్ళీ వెంటనే సినిమా చేద్దామని భావించినా… ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చెయ్యాల్సి ఉండటం తో వాయిదా వేసాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని లైన్లో పెట్టినట్టు సమాచారం. శివ చిరంజీవి తో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ తో ఒక సినిమా చేస్తాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో చేయడానికి రెడీ అవుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version