మ‌రో మ‌ల్టీ స్టార‌ర్ సినిమాకు సిద్ధ‌మైన‌ ఎన్టీఆర్!

-

ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ దూకుడు పెంచేసాడు. వ‌రుసగా సినిమాలకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నాడు. ఇప్ప‌టికే ఉప్పెన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబుతో పాటు కేజీఎఫ్ లాంటి సంచ‌ల‌నం సృష్టించిన ప్ర‌శాంత్ నీల్ తో సినిమాలు చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. అలాగే ప‌లువురు త‌మిళ్, హింది ద‌ర్శ‌కుల‌తో కూడా తార‌క్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. అయితే తాజా గా తారక్ ఒక సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని స‌మాచారం.

టాలీవుడ్ డైరెక్ట‌ర్ ప‌రుశురాం పెట్లా ద‌ర్శ‌కత్వంలో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడ‌నే వార్త‌లు ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో, ఫిల్మ్ న‌గ‌ర్లో చక్క‌ర్లు కొడుతున్నాయి. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రెంజ్ లో తీయాల‌ని డైరెక్ట‌ర్ ప‌రుశురాం పెట్లా ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. అలాగే ఈ సినిమా మ‌ల్టీ స్టార‌ర్ గా తెర‌కెక్కనుంద‌ని స‌మాచారం. ఒక హీరో పాత్ర‌లో తార‌క్ ఉండ‌గా.. మ‌రో హీరో ఎవ‌రో తెలియాల్సి ఉంది. కాగ తార‌క్ ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్ వంటి మ‌ల్టీ స్టార‌ర్ సినిమాలో న‌టించాడు.

ఈ సినిమాతో రామ్ చ‌ర‌ణ్ తో పాటు తార‌క్ కూడా పాన్ ఇండియా స్టార్లు అయ్యే అవ‌కాశం ఉంది. కాగ ఇప్పుడు ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చే మ‌ల్టీ స్టార‌ర్ ఎలా ఉండ‌బోతుందో అనే ఉత్కంఠ నంద‌మూరి అభిమానుల్లో ఉంది. కాగ ఈ సినిమా పై ఇప్ప‌టి వ‌ర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. కానీ త్వ‌ర‌లోనే మ‌రో హీరోను ఎంపిక చేసిన త‌ర్వాత అధికరికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version