తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ మృతి చెందాడు. కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు కౌశిక్. అయితే… కౌశిక్ కోరిక మేరకు వీడియో కాల్ కూడా మాట్లాడి ధైర్యాన్నిచ్చారు జూనియర్ ఎన్డీఆర్. అటు కౌశీక్ చికిత్సకు అవసరమైన కొంత మొత్తాన్ని అందించారు ఎన్టీఆర్.

గత రాత్రి ఇంట్లో చికిత్సపొందుతూ మృతి చెందాడు కౌశిక్. వాస్తవంగా ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ క్యాన్సర్ స్టేజ్ దాటిపోయింది. అందుకే ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ మృతి చెందాడు. వీరాభిమాని కౌశిక్ మృతి నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా సంతాపం తెలిపారు.