వైద్య సేవలకు గ్లోబల్ మెడికల్ హబ్ గా హైదరాబాద్ : మంత్రి రాజనర్సింహ

-

హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి సమీపంలోని కొండాపూర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కాన్సీవ ఫెర్టిలిటీ సెంటర్ ను మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా
ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం వైద్య సేవలకు గ్లోబల్ మెడికల్ హబ్ గా అభివృద్ధి చెందుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఫార్మా, వ్యాక్సిన్, ఐటీ
రంగాలలో హబ్ ఉన్న హైదరాబాద్ ఇప్పుడు గ్లోబల్ మెడికల్ హబ్ అభివృద్ధి చెందుతోందన్నారు. రాష్ట్ర ప్రజలతో పాటు దేశ విదేశాలకు చెందిన రోగులు నగరంలో ఉన్న అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక సాంకేతికతతో సేవలందిస్తున్న పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకు వస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

రాష్ట్రంలో మెడికల్ టూరిజం అభివృద్ధి చెందుతుందని, ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయి
లో అభివృద్ధి పరిచి సేవలందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ రంగంలో వరంగల్, హైదరాబాద్, కొండాపూర్ లో IVF సెంటర్లను ప్రారంభిస్తున్నామన్నారు. ఆధునిక హంగులతో ఏర్పాటు చేసిన  ఆస్పత్రి యాజమాన్యాన్ని ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహఅభినందించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news