మెరుపు వేగంతో మెరుగైన వార్తలు అందిస్తున్న ఎన్టీవీని తెలుగు రాష్ట్రాల ప్రజలు మరోసారి అగ్రస్థానంలో కూర్చోబెట్టారు. 24×7 నిరంతరం వార్త ప్రసారాలతో ఎప్పటికప్పుడు నిజమైన వార్తలనే ప్రసారం చేస్తూ.. అవాస్తావాలకు చోటు లేకుండా.. ప్రజానీకానికి నాణ్యమైన కంటెంట్‌ను అందిస్తూ మరోసారి అందనంత ఎత్తుకు ఎదిగింది. ఛానెల్ ప్రారంభించిన నాటి నుంచే ప్రేక్షకుల ఆదరణ పొందుతూ ఇంతింతై వటుడింతై అన్నట్లు అందనంత ఎత్తు రేటింగ్స్‌ను సొంతం చేసుకుంది.
పట్టణం నుంచి మారుమూల గ్రామాల వరకు ఖచ్చితమైన వార్తలు అంటే ఎన్టీవీ అనేంతగా ప్రజల నమ్మకాన్ని చూరగొంది. బ్రేకింగ్ న్యూస్‌ను ఎప్పుడూ లైవ్‌లో ఉండి రిపోర్ట్ చేయడం, ఖచ్చితమైన సర్వేలకు ఎన్టీవీ పెట్టింది పేరు. వార్తలంటే కేవలం తప్పుడు ప్రచారాలు, అనవసరమైన సంచనాలు కాదు, నిజాన్ని ధైర్యంగా చెప్పగలగడం, ప్రజలకు అవసరమైన విషయాల్ని వారి దగ్గరకు చేర్చడమే అని నమ్మిన ఎన్టీవీకి ప్రజలు నెం.1 స్థానాన్ని కట్టబెట్టారు.
అయితే.. తాజాగా వెల్లడైన బార్క్ రేటింగ్స్ బద్దలు కొట్టి… ఎన్టీవీ 71.9 టీఆర్పీలతో ఫస్ట్ ప్లేస్ పరంపరను కొనసాగిస్తోంది. ‘ప్రతి క్షణం-ప్రజా హితం’ అనే స్లోగన్‌ను పెట్టుకుని, కేవలం దాన్ని స్లోగన్‌గా వదిలేయకుండా ప్రతిక్షణం ఆ మాట మీద ఉండటమే ఎన్టీవీ ఈ స్థానానికి రావడానికి కారణం. దేనికీ బెదరకుండా, ఎవర్నీ బెదిరించకుండా, సంబరాలు, పర నింద లేకుండానే సెలెంట్‌గా ఎన్టీవీ దూసుకుపోతోంది. ప్రజల పక్షాన నిలబడుతుండటమే ఎన్టీవీని తెలుగు మీడియా రంగంలో మేటిగా నిలబెడుతుంది. కాగా, ఎన్టీవీ నెం.1గా నిలవడంతో ఎన్టీవీ సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.