ఓ ప్రభుత్వ ఉద్యోగికి ఓ యువతితో పరిచయం అయింది. రాను రాను ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారు. తర్వాత ఇద్దరికీ చనువు పెరిగింది. ఇద్దరూ నగ్నంగా వీడియో కాల్స్ లో మాట్లాడుకున్నారు. ఆ తరువాత అసలు కథ మొదలైంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లోని ఓ ప్రభుత్వ ఉద్యోగికి ఓ యువతి తో పరిచయం ఏర్పడింది.
నిత్యం ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుకున్నారు. ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి న్యూడ్ వీడియోను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు దిగింది ఆ యువతి. ఆ ప్రభుత్వ ఉద్యోగి నుంచి ఐదు లక్షల వరకు కాజేశారు చీటర్స్. దీంతో ఆ ఉద్యోగి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.